Wednesday, October 10, 2007

భక్తిమార్గము

ఈ రోజు గురువారము సాయిబాబా యొక్క ఏకాదశ సూత్రములు మననం చేసుకొందాం:
శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు
1. షిర్డి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము

2.ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు.

3. ఈ భౌతిక దేహానంతరము సైతము నేనప్రమత్తుడనే.

4. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడును.

5. సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును.

6. సమాధి నుండియే నా మానుష శరీరము మాటలాడును.

7. నన్నాశ్రయించిన వానిని, నన్ను శరణు జొచ్చిన వానిని నిరంతరము రక్షించుటయే నా ప్రథమ కర్తవ్యము.

8. నా యందెవరికి దృష్టి గలదో, వారియందే నా యొక్క కటాక్షము గలదు.

9. మీ భారములన్నియు నాపై బడవేయుడు, నేను మోసెదను.

10. నా సహాయమును గాని, సలహాను గాని కోరిన తత్ క్షణమే యెసంగెదను.

11. నా భక్తుల గృహములందు “లేమి” యను శబ్ధము పొడసూపదు.
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహారాజ్ కి జై



భక్తిమార్గము


శ్రీ సాయి అమూల్య వజ్రరత్నములు

శ్రీ సాయి సత్ చరిత్రలోని ఒక్కొ అధ్యాయ క్రమము యొక్క ఆదేశము:
1. ఈ సృష్తి రహస్యం ఖేదింపగరండి,మీ పుట్టుక పట్టుకొమ్మను పట్టుకొనండి మీ నిజగృహమున కేగండి

2. నన్ను మీ పారమార్థిక సేవకునిగ నియమించండి.

3. ఎల్లవేళల ఆధ్యాత్మికనిధినే తలంచండి.

4. మీలోనే వున్న నన్ను గుర్తించండి

5. నా అంగాంగమున ఉండండి.

6. ఆధ్యాత్మికనిధికి వారసులుగా ఉండండి

7. అనాదరణ మాని అందరిని ఆదరించండి.

8. ఆధ్యాత్మికనిధిని పొందుటయే మానవ జన్మ విధియని తెలుసుకొండి

9. అన్ని జీవరాసులలో పరమాత్మను చూడండి

10. నీ మనస్సు నాకు అర్పించి నా స్నేహితుడవు కమ్ము

11. ప్రాయశ్చిత్త, పరిహారములు చేసుకొని అహంకారము విడువుము

12. భగవంతున్ని నమ్మినవాడు ఎన్నటికి చెడిపొడు. సాయి నీకు సిసలైన రక్షకుడని తెలుసుకొ.

13. అనుక్షణం భక్తి శ్రద్ధలను పెంపొందించుకొ. సదా సాయిని స్మరించండి. నిత్యము సాయి నామస్మరణ చేసుకొనండి.

14. త్యాగబుద్ధిని కలిగివుండండి. పవిత్రమార్గమును అభ్యాసము చేయండి.

15. సాయితో సన్నిహితము కలిగి ఉండండి.

16. &17. అమృతవాక్కుల అవగాహన చేసుకొని అనుసరించిన ఆచరించిన అదియే నీకు తరగని ‘నిధి’.

18. & 19. నిట్టూర్పులతో కాక నిష్టా ఓర్పును కలిగి ఉండుము. నమ్మకమే నీకు నిజమైన సొమ్ము. ఓరిమి నీకు మహా భాగ్యము. ఓరిమి నమ్మకములే నిజమైన ఆభరణములు.

20. మనస్సును నీ స్వాధీనములో నుంచుము. కలిగిన దానితో తృప్తి పొందుము.

21. నవవిధ భక్తిని తెలుసుకొమ్ము.

శ్రవణం – కీర్తనము – స్మరణం – పాదసేవనం – అర్చన – నమస్కారము – దాస్యము – సఖ్యత్వము – ఆత్మనివేదనము.

22. ఆహంకారమును విడచి ప్రకృతిని ప్రేమించుము. నియమనిష్ఠలే నీకు ఇచ్చు రక్ష.

23. వినయ భూషణము కలిగి వుండుము.

24. నీ కష్టసుఖములను సాయికి నివేదించుము.

25. ఆదేశించిన సూత్రములను ఆచరింపుము.

26. నికూ పట్టుకొమ్మైన నీ గురుపాదములు విడువకుము

27. అంతర్ముఖుడై ఉండుము. అందరియందు సమభావము కలిగి యుండుము.

28. ఆధ్యాత్మిక ఆణిముత్యములకు సాయి సాగరమున దూకుము.

29. సాత్విక భావములే కలిగి ఉండుము.

30. దీటైన నమ్మకము గట్టిదని తెలుసుకొ. కృతజ్ఞతా నమ్మకము కలిగియుండుము.

31. సాయి సూత్రములననుసరించియే జీవింపుము.

32. అపారమైన విశ్వాసముతో సాయి నిధిని దోచుకొనుము.

33. సత్యమును తెలిసికొని సత్యమును తోడిడుకొనుము.

34. ఓరిమి కలిగివుండిన సాయి ప్రేమ తెలియును.

35. నీ సాధనశక్త్యానుసారము సాయి రహస్యము తెలుసుకొనెదవు.

36. సాయి సత్యములు తెలియుటకు ఎల్లవేళల అప్రమత్తుడవై నుండుము

37. సాయి దేవుని చావడి ఉత్సవమును స్మృతికి తెచ్చుకొనుము.

38. నిస్సందేహముగ గురువు నీకు మేలు చేయునని నమ్మి యుండుము.

39. నీ అజ్ఞానమును తెలుసుకొని అట్టిదానిని విడనాడుము.

40. సర్వస్యశరణాగతి కోరిన జ్ఞానము కలుగును.

41. సృష్టిరహస్యము భేదించుటకు సాయి ఆశీర్వాదము కొరకు సాయిని ఆవాహన చేయుము.

42. అన్నార్తులకు అన్నదానము చేయుము. వస్త్రహీనులకు వస్త్రదానము చేయుము. సాయి నామస్మరణ చేయుము.

43. & 44. ఇతరులను నిందించకుము. ఓరిమి కలిగి యుండుము.

45. నీ గురువునందే ఎల్లవేళల దృష్టి నిలుపుము. నీ గురువును మనసార ప్రేమించుము.

46. సాయి పరమదయానిలయుడు. పావన గుణదాముడు, దత్తాత్రేయ స్వరూపుడు.

47. ఎంత చేసుకొన్న వారికి అంత మేలు కలుగునని తెలుసుకొ

48. శత్రుక్షేమము కోరుట నేర్చుకొనుము.

49. సంపూర్ణ శరణాగతియే నీకు మహదానందము కలిగించును.

50. గర్వాహంకారములను విడచి సాధుసజ్జనుడై నివసింప, ఆధ్యాత్మిక సోపానము నీకు చేరువైనుండును.

శ్రీ సాయి గురుదేవులు చెప్పిన శ్రీ సాయి సత్ చరిత్రలో 50 ఆధ్యయముల సారంశమిది.
చదువరులకు శ్రీ సాయి ఆశీస్సులు మెండుగ ఉండాలని కొరుకుంటూ …