Showing posts with label kavitha. Show all posts
Showing posts with label kavitha. Show all posts

Friday, September 28, 2007

నివేదన



ఇరు శరీరాల ఆలసట "సుఖానికి" నిదర్శనం నేను

మదనజ్వరం ముదిరి కన్నులను కామపిశాచి కమ్మేసి...

క్షణికావేశంలో చేసిన తప్పుకు...

బలిపశువునై...

పశువుల ప్రక్క చెత్తకుప్పలో రోధించాను

లంజ___! అను పదముతో మేల్కొలుపు

ఉదయం యం. సి. హెచ్ . తోట్ల దగ్గర విందుభొజనాలు

ఇక్కడ మేము కూడా మీకు పోటి అన్నట్లు కర్కశ శునకలు

రాత్రివేళలలోనైనా బ్రతుకులోని చేదును మరచి

నిదురపొదామంటే ఖాకీల జులుం మరొకవైపు

చిరుబాల్యంలోనే ఎన్ని కష్టాలు...

ఓ "సుఖ" బానిసలారా!

మీ "చిలిపి కోరిక" మా జీవితాలను బుగ్గి చేస్తుంది

మీ క్షణికమైన ఆవేశంతో ..

ఈ ప్రపంచంలో బలిపశువులుగా మారనీయకండి

అనాధ బాలల బాసటాగ నిలిచి నే చేసే ఆశ్రుతర్పణే
ఈ ... నివేదన