Tuesday, November 6, 2007

ఈ వారం కొంచెము బిజి. వచ్చేవారం తప్పకుండా వ్రాస్తాను.

Friday, October 26, 2007

టిప్స్

1. తలను బాగా పీడించే సమస్య చుండ్రు. దీనికోసం పుల్లటి పెరుగులో మెంతులు పోడిని నానవేసి తలకు పట్టించుకుంటే నాలుగైదుసార్లు చేస్తే చుండ్రు మటుమాయం అవుతుంది.
2. కొత్తిమీర అకులరసాన్ని పంచదార నీటిలో కలిపి పడుకునే ముందు తాగితే నిద్రలేమి సమస్య తీరిపోతుంది.

Saturday, October 20, 2007

టిప్స్:

టిప్స్:

చిన్న అల్లం ముక్కను ముద్దచేసి టేబుల్ స్పూన్ నూనెతో కలిపి ఉదయాన్నే సేవిస్తే బరువు తగ్గుతారు.
దానిమ్మకాయపై తోలును తీసి మోషన్స్ అవుతున్నప్పుడు నీళ్ళతో అరగదీసి ఆ మిశ్రమాన్ని కొద్దిగా మజ్జిగలో వేసి చిటికెడు ఉప్పు కలిపి సేవిస్తే మోషన్స్ త్వరగా తగ్గుతాయి.
కామెర్లు, మలబద్దకం, మూత్రరోగాలతో బాధపడేవారు క్యారేట్ రసాన్ని పరకడుపున త్రాగినట్లయితే వ్యాదుల నివారణ కలుగుతుంది.

ఆహ్లాదం

మీ మనస్సు కలతగా వుందా? మీ మనస్సు ఆహ్లాదం కోరుకుంటుందా? మీకు కడుపుపగిలేటట్లు నవ్వలనుందా.... అయితే తప్పక మీరు "పొగొ" చానల్ లో రాత్రి 10 గంటలకు వచ్చే "గ్యాగ్స్" ని ఎంజాయిచేయండి

Wednesday, October 10, 2007

భక్తిమార్గము

ఈ రోజు గురువారము సాయిబాబా యొక్క ఏకాదశ సూత్రములు మననం చేసుకొందాం:
శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు
1. షిర్డి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము

2.ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు.

3. ఈ భౌతిక దేహానంతరము సైతము నేనప్రమత్తుడనే.

4. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడును.

5. సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును.

6. సమాధి నుండియే నా మానుష శరీరము మాటలాడును.

7. నన్నాశ్రయించిన వానిని, నన్ను శరణు జొచ్చిన వానిని నిరంతరము రక్షించుటయే నా ప్రథమ కర్తవ్యము.

8. నా యందెవరికి దృష్టి గలదో, వారియందే నా యొక్క కటాక్షము గలదు.

9. మీ భారములన్నియు నాపై బడవేయుడు, నేను మోసెదను.

10. నా సహాయమును గాని, సలహాను గాని కోరిన తత్ క్షణమే యెసంగెదను.

11. నా భక్తుల గృహములందు “లేమి” యను శబ్ధము పొడసూపదు.
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహారాజ్ కి జై



భక్తిమార్గము


శ్రీ సాయి అమూల్య వజ్రరత్నములు

శ్రీ సాయి సత్ చరిత్రలోని ఒక్కొ అధ్యాయ క్రమము యొక్క ఆదేశము:
1. ఈ సృష్తి రహస్యం ఖేదింపగరండి,మీ పుట్టుక పట్టుకొమ్మను పట్టుకొనండి మీ నిజగృహమున కేగండి

2. నన్ను మీ పారమార్థిక సేవకునిగ నియమించండి.

3. ఎల్లవేళల ఆధ్యాత్మికనిధినే తలంచండి.

4. మీలోనే వున్న నన్ను గుర్తించండి

5. నా అంగాంగమున ఉండండి.

6. ఆధ్యాత్మికనిధికి వారసులుగా ఉండండి

7. అనాదరణ మాని అందరిని ఆదరించండి.

8. ఆధ్యాత్మికనిధిని పొందుటయే మానవ జన్మ విధియని తెలుసుకొండి

9. అన్ని జీవరాసులలో పరమాత్మను చూడండి

10. నీ మనస్సు నాకు అర్పించి నా స్నేహితుడవు కమ్ము

11. ప్రాయశ్చిత్త, పరిహారములు చేసుకొని అహంకారము విడువుము

12. భగవంతున్ని నమ్మినవాడు ఎన్నటికి చెడిపొడు. సాయి నీకు సిసలైన రక్షకుడని తెలుసుకొ.

13. అనుక్షణం భక్తి శ్రద్ధలను పెంపొందించుకొ. సదా సాయిని స్మరించండి. నిత్యము సాయి నామస్మరణ చేసుకొనండి.

14. త్యాగబుద్ధిని కలిగివుండండి. పవిత్రమార్గమును అభ్యాసము చేయండి.

15. సాయితో సన్నిహితము కలిగి ఉండండి.

16. &17. అమృతవాక్కుల అవగాహన చేసుకొని అనుసరించిన ఆచరించిన అదియే నీకు తరగని ‘నిధి’.

18. & 19. నిట్టూర్పులతో కాక నిష్టా ఓర్పును కలిగి ఉండుము. నమ్మకమే నీకు నిజమైన సొమ్ము. ఓరిమి నీకు మహా భాగ్యము. ఓరిమి నమ్మకములే నిజమైన ఆభరణములు.

20. మనస్సును నీ స్వాధీనములో నుంచుము. కలిగిన దానితో తృప్తి పొందుము.

21. నవవిధ భక్తిని తెలుసుకొమ్ము.

శ్రవణం – కీర్తనము – స్మరణం – పాదసేవనం – అర్చన – నమస్కారము – దాస్యము – సఖ్యత్వము – ఆత్మనివేదనము.

22. ఆహంకారమును విడచి ప్రకృతిని ప్రేమించుము. నియమనిష్ఠలే నీకు ఇచ్చు రక్ష.

23. వినయ భూషణము కలిగి వుండుము.

24. నీ కష్టసుఖములను సాయికి నివేదించుము.

25. ఆదేశించిన సూత్రములను ఆచరింపుము.

26. నికూ పట్టుకొమ్మైన నీ గురుపాదములు విడువకుము

27. అంతర్ముఖుడై ఉండుము. అందరియందు సమభావము కలిగి యుండుము.

28. ఆధ్యాత్మిక ఆణిముత్యములకు సాయి సాగరమున దూకుము.

29. సాత్విక భావములే కలిగి ఉండుము.

30. దీటైన నమ్మకము గట్టిదని తెలుసుకొ. కృతజ్ఞతా నమ్మకము కలిగియుండుము.

31. సాయి సూత్రములననుసరించియే జీవింపుము.

32. అపారమైన విశ్వాసముతో సాయి నిధిని దోచుకొనుము.

33. సత్యమును తెలిసికొని సత్యమును తోడిడుకొనుము.

34. ఓరిమి కలిగివుండిన సాయి ప్రేమ తెలియును.

35. నీ సాధనశక్త్యానుసారము సాయి రహస్యము తెలుసుకొనెదవు.

36. సాయి సత్యములు తెలియుటకు ఎల్లవేళల అప్రమత్తుడవై నుండుము

37. సాయి దేవుని చావడి ఉత్సవమును స్మృతికి తెచ్చుకొనుము.

38. నిస్సందేహముగ గురువు నీకు మేలు చేయునని నమ్మి యుండుము.

39. నీ అజ్ఞానమును తెలుసుకొని అట్టిదానిని విడనాడుము.

40. సర్వస్యశరణాగతి కోరిన జ్ఞానము కలుగును.

41. సృష్టిరహస్యము భేదించుటకు సాయి ఆశీర్వాదము కొరకు సాయిని ఆవాహన చేయుము.

42. అన్నార్తులకు అన్నదానము చేయుము. వస్త్రహీనులకు వస్త్రదానము చేయుము. సాయి నామస్మరణ చేయుము.

43. & 44. ఇతరులను నిందించకుము. ఓరిమి కలిగి యుండుము.

45. నీ గురువునందే ఎల్లవేళల దృష్టి నిలుపుము. నీ గురువును మనసార ప్రేమించుము.

46. సాయి పరమదయానిలయుడు. పావన గుణదాముడు, దత్తాత్రేయ స్వరూపుడు.

47. ఎంత చేసుకొన్న వారికి అంత మేలు కలుగునని తెలుసుకొ

48. శత్రుక్షేమము కోరుట నేర్చుకొనుము.

49. సంపూర్ణ శరణాగతియే నీకు మహదానందము కలిగించును.

50. గర్వాహంకారములను విడచి సాధుసజ్జనుడై నివసింప, ఆధ్యాత్మిక సోపానము నీకు చేరువైనుండును.

శ్రీ సాయి గురుదేవులు చెప్పిన శ్రీ సాయి సత్ చరిత్రలో 50 ఆధ్యయముల సారంశమిది.
చదువరులకు శ్రీ సాయి ఆశీస్సులు మెండుగ ఉండాలని కొరుకుంటూ …

Saturday, October 6, 2007

ప్రియా! నా మనోనేత్రంలో మెరిసిన ఊహఊర్వశి
ఆపిల్ పండ్ల లాంటి నీ నునుపైన చెక్కిళ్ళను
మృదుమదురంగా ముద్దుపెట్టుకోవాలనీ,
మంచుతో తడిసిన ముత్యాల ఆధరాలు చుంభించాలని,
నీ వక్షోజాల మధ్య నేను నిదురించాలనీ,
కాంచనగంగ నుంచి జాలువారుతున్న సెలయేరులా వున్న
నీ నాభి దగ్గర గిలిగింతలు పెట్టాలనీ,
హిమలయ శిఖరంలా మెరిసిపోతున్న నీ ఊరువులతో,
గిల్లికజ్జాలు పెట్టుకోవాలనీ,
నయాగారా జలపాతం వలె,
మానససరోవరంలోమెరిసిపోతున్న తామరలాంటి
నీ నాభి క్రింది భాగంపై నాట్యామడాలని,
నా మనసులో మెరిసిన ఊహ
అది నిజం చేస్తావని
నా రతిదేవి అయి
నను మురిపిస్తావని
నా చిలిపి ఊహ

Friday, October 5, 2007

హస్య గుళికలు

☺ నా భార్యతో కాపురం చెయ్యలేక చస్తున్నా? అన్నాడుసురేష్
వెంటనే అతని స్నేహితుడు “మే ఐ హెల్ప్ యూ...


☺ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి ఆ టక్కులాడి అరుణతో మీకు అక్రమసంబందం వుందా? లేదా? భర్తను నిలదీసి అడిగింది రమ

ఓసి పిచ్చి మొద్దూ మేమిద్దరం రహస్యంగా వివాహం చేసుకున్నామే, అక్రమసంబంధంఎలా అవుతుంది? కసురుకున్నాడు భర్త.


☺ “సుశీ, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా?” గోముగా అడిగాడు గోపి.

ఆమ్మో నీకు కళ్ళకలక వచ్చినప్పుడు నన్నిలా అడ్గడం బాగా లేదు గోపి అంది సుశీ.


కవిత

కట్నం కథ పెరిగింది
వధువుల వ్యధ పెరిగింది
మధుపానం పెరిగింది
మతం మత్తు పెరిగింది
జనాభా రేటు పెరిగింది
హత్యల రేటు పెరిగింది
నిరుద్యోగ వ్యవస్ధ పెరిగింది
రిజర్వేషన్ల సొద మిగిలింది

ఆకాంక్ష

నిన్ను చూసాను ! ఓ భరతమాతా!
నీ గత చరిత్ర గాఢనిద్రలో కల్గిన పీడకల
ఇపుడు కళ్ళ ముందు కదలాడుతున్న మరణమృదంగం
ఆకాశంలో అందంగా ఎగిరే తెల్లని శాంతి పావురం
రక్తంతో తడిసి అరుణవర్ణం దాల్చి ఎర్రని సూర్యునిలా మండుకుంటూ
రోజు ఆస్తమిస్తున్నఈ నాటి వంకర ధరిత్రిలో
మ్రోగుతున్న మరణమృదంగం ఆగేదెప్పుడో
మరల బాపు, నెహ్రు ఎగరేసిన శాంతిపావురం
మళ్ళి ఎగురుతుందనిపండు వెన్నల కురుస్తుందని
నీ కీర్తి అజరామరంగా నిలుస్తుందని
నా ఆకాంక్ష

నా దేశం

“అన్నమో! రామచంద్రా!" అంటూ
తిండి, బట్ట, ఇల్లు కోసంఆలమటించే ఆభాగ్యులున్న దేశం నాది
కుల,మత భేదాలు అంటూ తన్నుకు చచ్చేప్రజలున్న దేశం నాది
కట్నాల ఆరాటంలో కన్నెపిల్లలను బలి యిచ్చే దేశం నాది
పదవి కోసం ప్రాణాలను తీసే పైశాచిక నాయకులున్న దేశం నాది
మూఢనమ్మకాలతో జంతువులను బలి యిచ్చేదేశం నాది
ఇన్ని వన్నెచిన్నెలున్నా నా దేశానికి …ఎల్లలు కులాలు,మతాలు
నా దేశానికి వన్నే తెచ్చేది మత పోరాటం
నా దేశానికి దిక్కులు రాజకీయ (వి) నాయకులు
ఇన్ని హంగులున్న నా దేశం భరతదేశం
అభివృద్ధి చెందుతూనే వున్న నిరుపేద దేశం
అయినా … నా దేశం గొప్పది

ప్రియ

ప్రియ

మబ్బును వీడిన నీటిచుక్కవలె
చంద్రుని వీడిన తారకవలె
కంటి నుంచి జాలువారిన కన్నిటి చుక్కవలె
గూటి నుంచి నింగికి ఎగసిన పక్షివలె
కొమ్మ నుంచి వెలివేయబడిన పుష్పం వలె
నన్ను విడిచిన ప్రేయసి
నన్ను విడచివెళ్ళకు
నీ ప్రేమ కోసం అలమటించే ఆభాగ్యునివలెఎదురుచూస్తున్నాను
కావాలి నీ ప్రేమామృతం
పంచాలి జీవితాంతం

Monday, October 1, 2007

ముందుమాట

నేను వ్రాసిన ఈ కవితలు నా స్వంతం. వీటిపై మీ యొక్క అభిప్రాయలను తెలపండి. నేను ఇవి నా కాలేజీడేస్ లో వ్రాసినవి. ఈ బ్లాగర్స్ వల్ల నా మనసులోని మాటలను/ఊహాలను మీ అందరితో పంచుకొవటం ఎంతో ఆనందంగా వుంది.

Friday, September 28, 2007

నివేదన



ఇరు శరీరాల ఆలసట "సుఖానికి" నిదర్శనం నేను

మదనజ్వరం ముదిరి కన్నులను కామపిశాచి కమ్మేసి...

క్షణికావేశంలో చేసిన తప్పుకు...

బలిపశువునై...

పశువుల ప్రక్క చెత్తకుప్పలో రోధించాను

లంజ___! అను పదముతో మేల్కొలుపు

ఉదయం యం. సి. హెచ్ . తోట్ల దగ్గర విందుభొజనాలు

ఇక్కడ మేము కూడా మీకు పోటి అన్నట్లు కర్కశ శునకలు

రాత్రివేళలలోనైనా బ్రతుకులోని చేదును మరచి

నిదురపొదామంటే ఖాకీల జులుం మరొకవైపు

చిరుబాల్యంలోనే ఎన్ని కష్టాలు...

ఓ "సుఖ" బానిసలారా!

మీ "చిలిపి కోరిక" మా జీవితాలను బుగ్గి చేస్తుంది

మీ క్షణికమైన ఆవేశంతో ..

ఈ ప్రపంచంలో బలిపశువులుగా మారనీయకండి

అనాధ బాలల బాసటాగ నిలిచి నే చేసే ఆశ్రుతర్పణే
ఈ ... నివేదన

Thursday, September 20, 2007

ప్రార్థన

నమో సాయిరాం, నమో సాయిరాం, ప్రభో సాయిరాం,మనసాస్మరమి